ఎస్సీ, ఎస్టీ, బీసీలకు బ్యాంక్ పరీక్షలకు ఉచిత శిక్షణ

హైదరాబాద్ : బ్యాంకింగ్ రంగంలో పోటీపరీక్షలకు సిద్ధమయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు కమిషనర్ క్రిస్టినా జడ్‌చోంగ్తు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నిర్వహించే బ్యాంకు పీవో (ప్రొబేషనరీ ఆఫీసర్స్) పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు పీఈటీసీ హైదరాబాద్‌లో ఈ నెల 18 నుంచి ఉచిత శిక్షణ ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఆనలైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
× RELATED కివీస్ కెప్టెన్ ఒంట‌రి పోరాటం