గేయ రచయితను పరిచయం చేస్తానంటూ మోసం

వెంగళరావునగర్: గేయ రచయిత అనంత్ శ్రీరామ్‌ను పరిచయం చేస్తానంటూ ఓ వివాహితను మోసం చేసిన ఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. నెల్లూ రు జిల్లాకు చెందిన మహి ళ 2011 నుంచి నగరానికి వ చ్చిపోతుండేది. ఈ క్రమంలో అ మీర్‌పేటకు చెందిన బి.నా రాయణరాజు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రముఖ సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్‌ను పరిచయం చేస్తానని న మ్మించాడు. అతన్ని నమ్మిన మహిళ అడిగినప్పుడల్లా డబ్బు లు ఇచ్చేది. బంగారు ఆభరణాలతో పాటు పలుమార్లు నగదు ను తీసుకున్నాడు. ఇలా మొ త్తం రూ.10 లక్షల వరకు తీసుకున్నాడు. అనంత్ శ్రీరామ్‌ను పరిచయం చేయకపో గా, ఫోన్ స్విఛ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోయాడు.

× RELATED గతంలో నెరవేర్చిన విధంగానే ఈసారి కూడా: కేసీఆర్