త్రైమాసిక ఫలితాలు.. ఎస్‌బీఐ నష్టం 7718 కోట్లు

ముంబై : 2017-18 ఏడాదికి సంబంధించి నాలుగవ క్వార్టర్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుమారు 7718 కోట్లు నష్టాన్ని చవిచూసింది. జనవరి నుంచి మార్చ్ క్వార్టర్‌లో ఈ నష్టం ఎదురైంది. మార్కెట్ అంచనా వేసిన దాని కన్నా ఎక్కువే నష్టం వాటిల్లింది. గత ఏడాది డిసెంబర్‌లో, ఎస్‌బీఐ సుమారు 2416 కోట్ల నష్టాన్ని చవిచూసింది. త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన తర్వాత ఎస్‌బీఐ షేర్లు కూడా పరుగెత్తాయి. షేర్లు 5 శాతం పెరిగాయి. షేర్ వాల్యూ సుమారు 256 రూపాయలు పెరిగింది.

Related Stories: