ఫోన్‌కాల్స్‌ను మళ్లిస్తున్న నలుగురు అరెస్ట్

కాకినాడ: కాకినాడలో హైటెక్ మోసానికి పాల్పడుతున్నవారి గుట్టును రెండో పట్టణ పోలీసులు బయటపెట్టారు. అంతర్జాతీయ ఫోన్‌కాల్స్‌ను మళ్లిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాయ్ నిబంధనలకు విరుద్ధంగా అంతర్జాతీయ కాల్స్‌ను ఈ ముఠా మళ్లిస్తుంది. సిమ్ క్యారియర్ల ద్వారా ఫోన్‌కాల్స్‌ను ఈ ముఠా సభ్యులు మళ్లిస్తున్నారు. చైనాకు చెందిన స్కైలైన్ సంస్థతో ముఠా సభ్యులు ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన గణేశ్, రామదాస్, శ్రీధర్, తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగలకు చెందిన ముసలయ్యలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు హైదరాబాద్‌లోనూ కాల్స్ మళ్లిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి రూ.10 లక్షల విలువైన సిమ్ క్యారియర్లు, ఇన్వర్టర్లు స్వాధీనం చేసుకున్నారు.
× RELATED ఇంజిన్ రహిత రైలు ట్రైయిల్ రన్ విజయవంతం