నక్షత్రంలో రెజీనా!

చెన్నై చిన్నది రెజీనా తాజాగా మరో అవకాశాన్ని సొంతం చేసుకుందని తెలిసింది. గోవిందుడు అందరివాడేలే తరువాత దర్శకుడు కృష్ణవంశీ నక్షత్రం పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సందీప్‌కిషన్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా తొలుత కాజల్ అగర్వాల్‌ను పరిశీలిస్తున్నారని ప్రచారం జరిగింది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో కథానాయికగా రెజీనాను ఖరారు చేసినట్లు సమాచారం. పోలీస్ కావాలన్న లక్ష్యం వున్న ఓ యువకుడి కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్క్రిప్ట్ డిమాండ్ మేరకు కథానాయిక బికినీలో కనిపించే సన్నివేశాలు వున్నాయట. ఆ సన్నివేశాల్లో బికినీ ధరించి నటించడానికి రెజీనా అభ్యంతరం చెప్పకపోవడం వల్లే ఈ చిత్రానికి కథానాయికగా దర్శకుడు కృష్ణవంశీ ఆమెను ఎంపిక చేసుకున్నారని, రెజీనాపై చిత్రీకరించనున్న బికినీ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర వర్గాల సమాచారం. రెజీనా ప్రస్తుతం నారా రోహిత్ హీరోగా రూపొందుతున్న జో అచ్యుతానందలో నటిస్తోంది.