బండారు దత్తాత్రేయ కుమారుడు గుండెపోటుతో మృతి

హైదరాబాద్: మాజీ కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు బండారు దత్తాత్రేయ కుమారుడు బండారు వైష్ణవ్(21) గుండెపోటుతో మృతి చెందారు. ముషీరాబాద్ గురునానక్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వైష్ణవ్ ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ముషీరాబాద్ ఎమ్మెల్యే లక్ష్మణ్, టీఆర్‌ఎన్ నాయకులు కార్పోరేటర్ శ్రీనివాస్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, వైష్ణవ్ మృతి పట్ల సానుభూతి తెలిపారు.

× RELATED నామినేషన్ల చివరి రోజు కూటమి పార్టీలకు కాంగ్రెస్ షాక్