నేడు టీఆర్‌ఎస్‌లో చేరనున్న

మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి తెలంగాణ ప్రగతి రథ చక్రాలు ఆగకూడదన్న ఉద్దేశంతో పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు క్యూ కడుతున్నారు. బుధవారం కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఉప్పల్ నియోజకవర్గం నుంచి బండారి లకా్ష్మరెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. వీరితోపాటు ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన డివిజన్ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. అదేవిధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై బుధవారం సీఎం కేసీఆర్ సమక్షంలో అనుచరులతోకలిసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని కరీంనగర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు ఆకారపు భాస్కర్‌రెడ్డి మంగళవారం మీడియాకు తెలిపారు.