హాకీకి సర్దార్ వీడ్కోలు

న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ అనూహ్యంగా ఆటకు గుడ్‌బై చెప్పాడు. భారత విజయాలలోలకీలకపాత్ర పోషించిన సర్దార్..యువ ఆటగాళ్లకు అవకాశం దక్కేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇటీవలే ముగిసిన ఆసియా క్రీడల సందర్భంగా 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఆసక్తిని కనబరిచాడు. కాగా, వచ్చే శుక్రవారం అధికారికంగా తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని తెలిపారు. బుధవారం ప్రకటించిన 25 మంది ప్రాబబుల్స్ జాబితాలో సర్దార్ సింగ్ పేరు లేకపోవడంతో అతనీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.2006లో జట్టులోకి వచ్చిన సర్దార్ సింగ్ మిడ్‌ఫీల్డ్‌లో భారత్ తరఫున అద్భుతంగా రాణించాడు. 2008 నుంచి 2016వరకు భారత హాకీ జట్టు కెప్టెన్‌గా సేవలందించిన సర్దార్ సింగ్ ఇప్పటి వరకు 350 పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లాడాడు.