ఆంక్షల్ని ఛేదించాలి!

తన మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుంది అగ్ర కథానాయిక సమంత. ఎలాంటి భేషజాలు లేకుండా నడచుకోవడం ఈ చెన్నై సోయగం నైజంగా చెబుతారు. గత ఏడాది ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాను బికినీలో ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేసింది సమంత. దీనిపై కొందరు అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పెళ్లయిన తర్వాత అలాంటి ఫొటోలు పెట్టడమేమిటని విమర్శలు చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ వివాదంపై మాట్లాడింది సమంత. స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో మన ఆలోచనా విధానాల్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. స్త్రీల వస్త్రధారణ ఎలా వుండాలో మరొకరు నిర్ణయించడమేమిటి? పెళ్లయిన అమ్మాయి ఫలానా వస్ర్తాలే ధరించాలని చెప్పడంలో అర్థం లేదు. ఇలాంటి ఆంక్షల్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. స్త్రీలు తమదైన స్వేచ్ఛను ఆస్వాదించాలి. ఈ విషయాన్ని చెప్పడానికే బికినీ ఫొటోను పోస్ట్ చేశాను అని చెప్పింది.