పోలీసుల ఆరోగ్యపథకానికి

-ఈహెచ్‌ఎస్ రేట్ల వర్తింపుపై హర్షం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులకు కల్పించిన ఈహెచ్‌ఎస్ పథకంలోని ధరలనే పోలీస్ సిబ్బంది ఆరోగ్యభద్రత పథకానికి వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 113 విడుదల చేయడం సంతోషంగా ఉన్నదని రాష్ట్ర పోలీసుఅధికారుల సంఘం అధ్యక్షుడు వై గోపిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జీవో ఇప్పించినందుకు తమ సంఘం తరఫున డీజీపీ మహేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు గోపిరెడ్డి పేర్కొన్నారు.