మోచేతులపై నల్లటి మచ్చలున్నాయా?

ముఖం, చేతులు అందంగా ఉన్నప్పుడు మోచేతులు మాత్రం నల్లటి మచ్చలతో ఇబ్బందికి గురిచేస్తుంటాయి. నల్లని మచ్చలను సులువుగా తొలిగించడానికి ఈ కింది చిట్కాలను ప్రయత్నించండి. * బాదం పప్పును రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే బాదం పేస్ట్ చేసి అందులో కొంచెం తేనె, పెరుగు కలుపాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులకు రాయాలి. 50 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుగాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే నల్లటి మచ్చలు తొలిగిపోతాయి. * కొబ్బరినూనెలో కొంచెం నిమ్మరసం కలుపాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులకు రాయాలి. 30 నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. తరుచూ ఇలా చేస్తే మోచేతులు మృదువుగా మారుతాయి. * నిమ్మకాయ ముక్కను చక్కెరలో అద్ది, ముందుగా గోరువెచ్చని నీటితో శుభ్రపరిచిన మోచేతులు, మోకాళ్లకి రుద్దాలి. 25 నిమిషాల తరువాత నీటితో కడుగాలి. రోజుకు రెండుసార్లు ఇలా చేస్తే నలుపు పోతుంది. * వంటసోడాలో కొంచెం ఉప్పు, నీరు కలుపాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులకు అప్లయి చేయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడుగాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే మోచేతులు కాంతివంతంగా మారుతాయి.

Related Stories: