వియత్నాంలో వరదలు.. 37 మంది మృతి

హనోయి: వియత్నాంలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ భారీగా వరదలు వస్తున్నాయి. ఆ వరదల వల్ల సుమారు 37 మంది చనిపోయారు. మరో 40 మంది గల్లంతయ్యారు. నార్తర్న్, సెంట్రల్ ప్రావిన్సుల్లో.. అల్పపీడనం వల్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇదే ప్రాంతాల్లో కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. వాటి వల్ల మరో 21 మంది గాయపడ్డారు. భారీగా వస్తున్న వరద నీరు వల్ల అధికారులు డ్యామ్ గేట్లను ఎత్తివేస్తున్నారు. సెంట్రల్ ప్రావిన్సులో సుమారు 17 వేల ఇండ్లను ఖాళీ చేయించారు. ఇక్కడే 200 ఇండ్లు కొట్టుకుపోయాయి. మరో 18 వేల ఇండ్లు ధ్వంసం అయ్యాయి.

Related Stories: