నేటి నుంచే ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫ్రీడం సేల్

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ది బిగ్ ఫ్రీడం సేల్ పేరిట ఓ ప్రత్యేక సేల్‌ను ఇవాళ ప్రారంభించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సేల్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగనున్న ఈ సేల్‌లో అనేక ప్రొడక్ట్స్‌పై ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలను అందిస్తున్నారు.

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ప్రతి 8 గంటలకు ఒకసారి బ్లాక్ బస్టర్ డీల్స్‌ను అందిస్తున్నారు. ప్రతి గంటకు కొన్ని ఉత్పత్తులపై భారీ తగ్గింపు ధరను అందిస్తున్నారు. ఫీచర్‌ఫోన్లపై 30 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఐటమ్స్ కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఇక ఇవే కాకుండా హానర్ 7ఎ, యాపిల్ ఐఫోన్ ఎస్‌ఈ, అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1, హానర్ 9 లైట్, షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ, గూగుల్ పిక్సల్ 2, 2 ఎక్స్‌ఎల్, నోకియా 5, శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లను భారీ తగ్గింపు ధరలకే అందిస్తున్నారు.

Related Stories: