చిరుతను చంపిన ఐదుగురు అరెస్ట్

లఖింపుర్ ఖేరి: చిరుతను చంపిన కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నవంబర్ 4న దుద్వా టైగర్ రిజర్వ్ పరిధిలో చిరుత దాడిలో ఓ వ్యక్తి తీవ్రగాయాలై ప్రాణాలు విడిచాడు. ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్థులు చిరుతపై దాడి చేసి చంపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. చిరుతను చంపిన ఘటనలో మరో నిందితుడు ముఖేశ్‌ను అరెస్ట్ చేయాల్సి ఉందని దుద్వా టైగర్ రిజర్వ్ అధికారి రమేశ్ కుమార్ పాండే తెలిపారు.

Related Stories: