తానాజీతో బాలీవుడ్ అరంగేట్రం

సీనియర్ నటుడు జగపతిబాబు వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. ఇటు ప్రతినాయకుడిగా, అటు కథలో కీలమైన క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రల్లో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. జగపతిబాబు హిందీలో అరంగేట్రం చేస్తున్న చిత్రం తానాజీ. చారిత్రక కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో అజయ్‌దేవ్‌గణ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఓమ్‌రౌత్ దర్శకుడు. మరాఠీ యోధుడు ఛత్రపతి శివాజీ దగ్గర సైన్యాధ్యక్షుడిగా పనిచేసి పలు యుద్ధాల్లో విజయాలకు కారకుడైన తానాజీ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ముంబయి శివారులో షూటింగ్ జరుగుతున్నది. ఈ సినిమాలో జగపతిబాబు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన లుక్ ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో అందరిని ఆకట్టుకుంటున్నది. తలపాగా ధరించి గుబురు మీసం తో ఆయన కనిపిస్తున్నారు. జగపతిబాబు బాలీవుడ్ కెరీర్‌కు ఈ సినిమా కీలకం కానుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.