మూడు పేక‌ ముక్క‌ల‌పై ర‌వితేజ డిఫ‌రెంట్ లుక్స్

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ ప్ర‌స్తుతం శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ‘వెంకీ, దుబాయ్‌ శీను’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ మూవీపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఇలియానా చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్ళీ తెలుగు తెర‌పై మెర‌వ‌నుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. అక్టోబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ రీసెంట్‌గా విడుద‌ల చేశారు. మూడు పేక ముక్కల మీద ర‌వితేజ మూడు స్టిల్స్‌తో ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు. అంటే చిత్రంలో ర‌వితేజ మూడు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్న‌ట్టుతెలుస్తుంది . ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవి ప్రకాష్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యు సింగ్, విక్రమ్ జిత్, రాజ్‌వీర్ సింగ్, శుభలేఖ సుధాకర్, శియాజీ షిండే తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం మాస్ మ‌హారాజా ర‌వితేజ అభిమానుల‌కి మంచి వినోదం అందిస్తుంద‌ని అంటున్నారు.

Related Stories: