అబిడ్స్ ఆర్‌ఎస్ బ్రదర్స్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ : అబిడ్స్ ఆర్‌ఎస్ బ్రదర్స్‌లో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ వస్త్ర దుకాణం రాత్రి 10 గంటల తర్వాత మూసేశారు. ఆ తర్వాత కాసేపటికే నాలుగు అంతస్తుల ఆర్‌ఎస్ బ్రదర్స్‌లో.. కింది అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, స్థానికులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ లోపే నాలుగో అంతస్తు వరకు మంటలు వ్యాపించడంతో బట్టలు పూర్తిగా కాలిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి మంటలను అర్పివేసింది. కోట్ల రూపాయాలలో ఆస్తి నష్టం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Related Stories: