గగన్‌పహాడ్‌లో భారీ అగ్నిప్రమాదం

రంగారెడ్డి : గగన్‌పహాడ్ పారిశ్రామికవాడలో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ప్లాస్టిక్ కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న నాలుగు ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి. షార్ట్ సర్క్యూట్‌తోనే అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.

Related Stories: