కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం

రంగారెడ్డి: జిల్లాలోని మైలార్‌దేవులపల్లి సమీపంలోని కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం సంభవించింది. షాలీమార్ కొబ్బరినూనె సంస్థ గోదాములో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. రంగంలోకి దిగిన నాలుగు ఫైరింజన్లు.. మంటలను అదుపు చేశాయి. గోదాము నుంచి భారీగా పొగ రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు.
× RELATED బంధువుల ఇంట్లో బస.. పోలింగ్ సిబ్బంది తొలగింపు