అనంతవాసుదేవ ఆలయంలో అగ్నిప్రమాదం

ఒడిశా: భువనేశ్వర్‌లోని అనంతవాసుదేవ ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగి 15 వంట గదులు దగ్ధమయ్యాయి. 10 అగ్నిమాపక యంత్రాలతో నాలుగు గంటల పాటు శ్రమించిన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదంలో లక్షలాదిరూపాయల ఆహార సామాగ్రి దగ్ధమయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ వంటగదుల్లో వేలాది మంది భక్తులకు అన్నప్రసాదం తయారు చేస్తారు.

Related Stories: