సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని ప్రేమపేరుతో నమ్మించి.

బంజారాహిల్స్ : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న యువతిని ప్రేమపేరుతో నమ్మించి.. ఆమె వద్ద నుంచి లక్షలాది రూపాయలను తీసుకుని ఉడాయించాడు. బాధిత యువతి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. యూసుఫ్‌గూడలో నివాసం ఉంటున్న యువతి(27) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నది. మూడేండ్ల క్రితం స్నేహితుడు వీనత్ ద్వారా శరత్ అనే వ్యక్తి యువతికి పరిచయం అయ్యాడు. వీరి పరిచయం స్నేహంగా మారడంతో పాటు ప్రేమిస్తున్నానంటూ అమెకు శరత్ దగ్గరయ్యాడు. తాను వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నానంటూ పలుమార్లు క్రెడిట్ కార్డుద్వారా డబ్బులు తీసుకోవడం, యువతి పేరుతో పర్సనల్ లోన్‌లు తీసుకోవడం చేశాడు. ఈ మొత్తాన్ని తన స్నేహితుడి చెల్లెలు అకౌంట్ అంటూ ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు.

కాగా..ఇటీవల శరత్ వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన యువతి ఆరా తీయగా అతడిపేరు శరత్ కాదని, షేక్ కిన్వాన్ అహ్మద్ అని తేలింది. దీంతో తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ కోరగా అందుకు నిరాకరించడంతో పాటు అంతుచూస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పో లీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు శరత్ అలియాస్ షేక్ కిన్వన్ అహ్మద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

× RELATED బాలిక కిడ్నాప్..24 గంటల్లోనే కాపాడారు