మల్టీప్లెక్స్‌లలో అధిక ధరల విక్రయంపై జరిమానా విధింపు

అమరావతి: మల్టీప్లెక్స్‌లలో అధిక ధరలకు తినుబండారాల విక్రయంపై జిల్లా వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు వెలువరించింది. ఏపీలోని విజయవాడలో గల షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌ థియేటర్లకు వినియోగదారుల ఫోరమ్ మొట్టికాయ వేసింది. సీల్డ్ ప్యాక్‌లో ఉన్న తినుబండారాలు థియేటర్లలోకి అనుమతించాలని కోర్టు ఆదేశించింది. మల్టీప్లెక్స్‌ థియేటర్లలలో అధిక ధరలకు విక్రయాలపై వినియోగదారులు ఫోరంను ఆశ్రయించారు. మార్గదర్శక సమితి సహకారంతో గత ఏడాది ఏప్రిల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. పలు వాదనలు అనంతరం జిల్లా వినియోగదారుల ఫోరం తీర్పును వెల్లడించింది. ఎల్‌ఈపీఎల్, ట్రెండ్ సెట్, పీవీఆర్, పీవీఆర్ ఐనాక్స్. మల్టీప్లెక్స్‌ థియేటర్లపై చర్యలు తీసుకోవాలని తీర్పును ప్రకటించింది. అదేవిధంగా తినుబండారాలు, శీతల పానియాలను అధిక ధరలకు విక్రయించినందుకు రూ. 5 లక్షల జరిమానా విధించింది. ఆదేశాలను తప్పక అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఆదేశాల అమలు, పర్యవేక్షణ బాధ్యతను తూనికలు, కొలతలశాఖకు అప్పగింత. న్యాయమూర్తి సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలుగులో తీర్పు వెలువరించారు.

Related Stories: