రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం

సిద్దిపేట : మే 26 న గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. సంఘటన జరిగిన వెంటనే సీఏం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా, ప్రభుత్వం అండగా ఉంటుందంటూ మంత్రి హరీశ్‌రావు బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం తరుపున మంజూరైన చెక్కులను శుక్రవారం సిద్దిపేట విద్యుత్తు భవన్‌లో బాధిత కుటుంబాలకు అందజేశారు. దైవ దర్శనానికి వెళ్ళి ప్రమాదంలో మరణించిన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం పెద్దమ్మగూడెం గొర్ల లక్ష్మణ్ యాదవ్ (విలేకరి), గొర్ల విజయ, గొర్ల చిన్నమల్లేశం, గొర్ల గంగమ్మ, మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన నర్సింలు, ఓంకార్, శ్రీనివాసులు, సుశీల, కరీంనగర్ జిల్లా భారత్ నగర్‌కు చెందిన సింధుజ, పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదవరిఖని లక్ష్మీ నగర్‌కు చెందిన దాసరి సాయి నిఖిల్, ఆసిఫాబాద్ జిల్లా బ్రాహ్మణవాడకు చెందిన శ్రీ ఆచార్య పంకజ్‌కుమార్, కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గ్రామానికి చెందిన కళ్ళెపు రాజురెడ్డిలు మృతి చెందారు. ప్రమాదంలో ఎనిమిది కుటుంబాలకు చెందిన 12 మంది మృతి చెందగా ఒక్కొ కుటుంబానికి 5 లక్షల చొప్పున రూ.40 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జేసీ పద్మాకర్, డీఆర్వో చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అక్తర్ పటేల్, కౌన్సిలర్లు బర్ల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
× RELATED నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు