అరుణ్ జైట్లీకి కిడ్నీ మార్పిడి చికిత్స విజయవంతం

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి కిడ్నీ మార్పిడి చికిత్స విజయవంతమైంది. ఇవాళ ఉదయం జైట్లీకి శస్త్రచికిత్స విజయవంతంగా చేశామని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. జైట్లీతో పాటు కిడ్నీని దానం చేసిన వ్యక్తి.. ఇద్దరూ కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. 65 ఏళ్ల జైట్లీ గత కొంత కాలం నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత నెలలో ఆయనకు వైద్యులు డయాలిసిస్ చేశారు. కిడ్నీ మార్పిడి చికిత్స నేపథ్యంలో జైట్లీ తన లండన్ పర్యటనను రద్దు చేసుకున్నారు.
× RELATED కుప్పకూలిన కివీస్.. భారత్ టార్గెట్ 158