లేక్ విక్టోరియాలో బోటు మునక.. 86 మంది మృతి

లేక్ విక్టోరియా: ఆఫ్రికా దేశం టాంజానియాలో ఘోర బోటు ప్రమాదం చోటుచేసుకున్నది. లేక్ విక్టోరియాలో పడవ బోల్తా పడిన ఘటనలో 86 మంది మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో 200 మంది ప్రయాణికులు ముగిని ఉంటారని అంచనా వేస్తున్నారు. ఉకోరా, బుగొలోరా దీవుల మధ్య బోటు మునిగింది. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న పడవ.. ఒకవైపు ఒరగడంతో ఈ ప్రమాదం జరిగింది. వాస్తవానికి బోటు కెపాసిటీ వందే అయినా.. ప్రమాద సమయంలో సుమారు 400 మంది ఉన్నారని అంచనా వేస్తున్నారు. సుమారు వంద మందిని ఇప్పటికే రెస్క్యూ చేశారు. అందులో 37 మంది పరిస్థితి విషమంగా ఉంది. అయితే బోటు ప్రయాణం కోసం ఎంత మందికి టికెట్లు ఇచ్చారో స్పష్టంగా తెలియడం లేదు. డేటా మెషీన్ కూడా ప్రమాదంలో పాడైపోయినట్లు చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం స్థానికులు కూడా అధికారులకు హెల్ప్ చేస్తున్నారు. 1996లోనూ లేక్ విక్టోరియాలో పెను ప్రమాదం జరిగింది. భారీ నీటి సరస్సులో ఎంబీ బుకోబా బోటు మునిగింది. ఆ ప్రమాదంలో సుమారు వెయ్యి మందికి వరకు మరణించారు.

Related Stories: