పాక్‌లో రెచ్చిపోయిన టీటీపీ ఉగ్రవాదులు

-తొలుత పోలీసులపై కాల్పులు - దవాఖానలో ఆత్మాహుతి దాడి -తొమ్మిది మంది దుర్మరణం -40 మంది వరకు గాయాలు పెషావర్‌: పాకిస్థాన్‌లోని ఖైబర్‌ ఫఖ్తుంవా రాష్ట్రం డేరా ఇస్మాల్‌ఖాన్‌ జిల్లా పరిధిలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ఉగ్రదాడుల్లో ఆరుగురు పోలీసులు సహా 9 మంది దుర్మరణం చెందారు. మరో 40 మంది వరకు గాయపడ్డారు. కోట్ల సైదన్‌ చెక్‌పోస్ట్‌ వద్దకు రెండు బైకులపై గుర్తుతెలియని నలుగురు సాయుధ ఉగ్రవాదులు వచ్చారు. వారు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతిచెందారు. వారి మృతదేహాలను దవాఖానకు తరలించగా అక్కడ గుమికూడిన ప్రజల మధ్యకు వెళ్లిన బుర్కా ధరించిన ఓ మహిళ ఆత్మాహుతి దాడికి తెగబడింది. ఆత్మాహుతి దాడిలో నలుగురు పోలీసులు సహా ఏడుగురు మృతిచెందారని చెప్పారు. మహిళతో ఆత్మాహుతి దాడి ఎప్పుడూ జరుగలేదని పోలీసులు తెలిపారు. బాంబర్‌ తల నుంచి కాళ్ల వరకు బుర్కా ధరించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దాడికి తామే బాధ్యులమని తెహెరిక్‌-ఈ- తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) ప్రకటించింది.
More