టెలికంలోకి ఎఫ్‌డీఐల వరద

-గతేడాదిలో ఐదు రెట్లు పెరిగిన వృద్ధి న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: టెలికం రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) వరదలా వస్తున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలోకి 6.2 బిలియన్ డాలర్ల మేర వచ్చాయని ఆ శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన 1.2 బిలియన్ డాలర్లతో పోలిస్తే మూడేండ్లలో ఐదింతలు పెరిగాయని మంత్రి వ్యాఖ్యానించారు. 2022 నాటికి 100 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను ఆకట్టుకునే లక్ష్యంగా టెలికం నూతన పాలసీని రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చిన 5జీ సేవలను భారత్‌లో 2020 నాటికి ప్రవేశపెట్టడానికి తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు, తద్వారా మెషిన్ టూ మెషిన్ కమ్యూనికేషన్స్, కృత్రిమ మేధస్సు వంటి టెక్నాలజీ రంగాలు మరింత బలోపేతంకానున్నాయన్నారు. వచ్చే 20 ఏండ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనున్నదని పేర్కొన్నారు.

Related Stories: