కుమారుల మృతిని తట్టుకోలేక.. తండ్రి ఆత్మహత్య

నిజామాబాద్: పట్టణంలోని గౌతమ్‌నగర్‌లో విద్యుత్ ఉద్యోగి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరివేసుకుని నగేష్(40) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు నెలల కిందట నగేష్ ఇద్దరు కుమారులు మృతిచెందారు. కుమారులిద్దరూ లేకపోవడాన్ని అతడు తట్టుకోలేకపోయాడు. అప్పటి నుంచి నగేష్ మానసికంగా కుంగిపోయాడు. కుమారుల మృతిని తట్టుకోలేక మనస్థాపంతో నగేష్ ఇవాళ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Related Stories: