రూ.1995 కే ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ 2.0 ఫిట్‌నెస్ ట్రాకర్

వాచ్‌ల తయారీదారు ఫాస్ట్రాక్ తన నూతన స్మార్ట్‌బ్యాండ్ రిఫ్లెక్స్ 2.0 ను తాజాగా విడుదల చేసింది. రూ.1995 ధరకు ఈ బ్యాండ్ వినియోగదారులకు అమెజాన్ సైట్‌లో ప్రత్యేకంగా లభిస్తున్నది.

ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ 2.0 ఫిట్‌నెస్ బ్యాండ్‌లో ఓలెడ్ డిస్‌ప్లే, స్టెప్స్, డిస్టాన్స్, క్యాలరీ కౌంటర్స్, సెడెంటరీ రిమైండర్, స్లీప్ మానిటరింగ్, బ్లూటూత్ 4.0 ఎల్‌ఈ, ఐపీ ఎక్స్6 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 10 రోజుల బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ బ్యాండ్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. అందుకు గాను ఆయా ప్లాట్‌ఫాంలపై ప్రత్యేకంగా యాప్‌ను కూడా అందిస్తున్నారు.

× RELATED రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి