సీఎం కేసీఆర్‌కు రైతు సోదరుల అరుదైన బహుమతి

కొడంగల్: రైతుబంధు, రైతు బీమా పథకాలతో వ్యవసాయం పండుగలా మార్చిన సీఎం కేసీఆర్‌కు కొడంగల్ నియోజకవర్గం గుండేపల్లికి చెందిన రైతు సోదరులు అరుదైన బహుమతి అందజేసి కృతజ్ఞతలు చాటుకున్నారు. తమ వ్యవసాయ క్షేత్రంలో ట్రాక్టర్‌తో టీఆర్‌ఎస్ పార్టీ గుర్తు కారును, సీఎం కేసీఆర్ పేరును గీసిన కేశవరెడ్డి, గోపాల్‌రెడ్డి తమ మద్దతు తెలిపారు. కొడంగల్ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపుతామని ధీమా వ్యక్తం చేశారు. కారు బొమ్మను, కేసీఆర్ పేరును గీయడానికి ట్రాక్టర్‌ను మాత్రమే ఉపయోగించినట్లు తెలిపారు.
× RELATED శిరసు వంచి నమస్కరిస్తున్నా : సీఎం కేసీఆర్