అది మహాకూటమి కాదు... దొంగల కూటమి..

వరంగల్ అర్బన్: కాంగ్రెస్‌పార్టీకి వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ కాంగ్రెస్‌తో పొత్తు ఎలా పెట్టుకుంటుందని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కోరుతున్న కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ రాష్ర్టానికి ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో యువకులను బలిగొన్నది కాంగ్రెస్ పార్టీ. విపక్షాలది మహా కూటమి కాదు... దొంగల కూటమి అని విమర్శించారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తిరుగలేదు. ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని ధీమా వ్యక్తం చేశారు.

× RELATED నెగేటివ్ రోల్ లో వరుణ్ తేజ్..?