సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ దర్శకురాలు కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. టాలీవుడ్ దర్శకురాలు బీ జయ కన్నుమూశారు. ఆమెకు 54 ఏండ్లు. గత రాత్రి 11 గంటల సమయంలో ఆమెకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆమె మరణించినట్లు జయ కుటుంబ సభ్యులు ప్రకటించారు. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో జయ నివాసం ఉంటున్నారు. 2003 లో చంటిగాడు అనే సినిమాకు జయ దర్శకత్వం వహించారు. దాని తర్వాత ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం లాంటి చిత్రాలకు జయ దర్శకత్వం వహించారు. జయ జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం సినీ వారపత్రికను జయ నడిపిస్తున్నారు. దర్శకురాలు, జర్నలిస్ట్‌గానే కాకుండా తాను దర్శకత్వం వహించిన సినిమాలకు తానే ఎడిటింగ్ చేసుకునేవారు జయ. పంజాగుట్ట శ్మశాన వాటికలో జయ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Related Stories: