క్యాన్సర్ స్పెషలిస్టునంటూ మోసం..

కోల్‌కతా; క్యాన్సర్ స్పెషలిస్టు (ఆంకాలజిస్ట్)అని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పశ్చిమబెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరదీప్ ఛటర్జీ అనే వ్యక్తి అంకాలజిస్ట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతని క్లినిక్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. అరదీప్‌ను మెడికల్ డిగ్రీ పట్టా చూపించాలని చెప్పగా..సంబంధం లేని ధ్రువ పత్రాలను చూపించాడని, దీంతో అతన్ని నకిలీ వైద్యుడిగా నిర్థారించినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించనున్నట్లు తెలిపారు.

Related Stories: