నకిలీ మరణ ధ్రువపత్రాల తయారీ ముఠా గుట్టురట్టు

రంగారెడ్డి : హయత్‌నగర్‌లో నకిలీ మరణ ధ్రువపత్రాల తయారీ ముఠా గుట్టురట్టు అయింది. 11 మంది ముఠా సభ్యులను హయత్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ మరణ ధ్రువపత్రాలు తయారు చేసి ఇళ్ల స్థలాలు విక్రయిస్తున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 11 మందిని విచారిస్తున్నారు.
× RELATED 17 నవంబర్ 2018 శనివారం మీ రాశి ఫలాలు