జుక‌ర్‌బ‌ర్గ్ రాజీనామా చేయాల‌ని డిమాండ్‌..

శాన్ ఫ్రాన్సిస్‌కో: ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌కు ఆ కంపెనీ ఇన్వెస్ట‌ర్ల నుంచి షాక్ త‌గిలింది. జుక‌ర్‌బ‌ర్గ్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని ఆ కంపెనీలు పెట్టుబ‌డి పెట్టిన‌వారు డిమాండ్ చేస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నం ఆధారంగా ఈ డిమాండ్ వెలుగులోకి వ‌చ్చింది. రిప‌బ్లిక‌న్ నేత‌కు చెందిన ఓ పీఆర్ కంపెనీతో ఫేస్‌బుక్ ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో ఫేస్‌బుక్‌లో వాటా ఉన్న జోన‌స్ క్రాన్ .. సీఈవో జుక‌ర్‌బ‌ర్గ్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. అయితే రిప‌బ్లిక‌న్ నేత కంపెనీతో ఫేస్‌బుక్ సంబంధాలు క‌లిగి ఉన్న అంశం త‌న‌కు తెలియ‌ద‌ని జుక‌ర్‌బ‌ర్గ్ అన్నారు. ఆ పీఆర్ సంస్థ‌తో ఇక నుంచి ప‌ని చేయ‌డం లేద‌ని జుక‌ర్‌బ‌ర్గ్ త‌న కంపెనీ టీమ్‌తో స్ప‌ష్టం చేశారు.

Related Stories: