ఫేస్‌బుక్ డేటింగ్ యాప్.. ప్రయోగాత్మకంగా కొలంబియాలో ఆవిష్కరణ

పాశ్చాత్య దేశాల్లో యుక్తవయసు వచ్చిన మగ, ఆడపిల్లలు ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు, బంధం ఏర్పరచుకునేందుకు పదేపదే విడిగా కలుసుకోవడాన్ని డేటింగ్ అంటారు. ప్రస్తుతం టిండర్, బంబుల్ వంటి యాప్స్ డేటింగ్ సేవన అందిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ డేటింగ్ ఆప్షన్‌ను ప్రవేశపెడుతున్నది. ప్రయోగాత్మకంగా కొలంబియాలో దీన్ని అమలు చేస్తున్నది. ఫేస్‌బుక్ డేటింగ్ చూడడానికి హింజ్ తరహాలో ఉంటుంది. టిండర్‌లా ఇది స్వైపింగ్ పద్ధతిలో పనిచేయదు. వినియోగదారు ప్రొఫైల్ ఆధారంగా కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టడం ఇందులో ఉంటుంది. డేటింగ్ పూల్‌ను విస్తిరంచేందుకు ఫేస్‌బుక్ తరహా గ్రూప్‌లు, ఈవెంట్‌లు ఉంటాయి. బయట కలుసుకునేలా ఈ ఆప్షన్ ప్రోత్సహిస్తుంది. నిజానికి ఫేస్‌బుక్‌లో డేటింగ్ చాలాకాలంగా ఉన్నదేనని, ఇప్పుడు దానిని ఒక ఆప్షన్‌గా రూపొందించడం జరుగుతున్నదని ఫేస్‌బుక్ ప్రాడక్ట్ మేనేజర్ నాథన్ షార్ప్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఇది మొబైల్ యాప్‌గానే అందుబాటులో ఉంటుంది. డెస్క్‌టాప్‌లో పనిచేయదు. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్నవారికి ఇది ఉచితంగా సేవలు అందిస్తుంది. ఎలాంటి యాడ్స్ ఉండవు.

Related Stories: