ఒక్క టెస్టు విజయంతో సంతృప్తి చెందలేం!

అడిలైడ్: ఒక్క టెస్టు మ్యాచ్ గెలుపుతో సంతోషంగా ఉండలేమ‌ని భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో విజ‌యం సాధించిన అనంత‌రం కోహ్లీ మాట్లాడాడు. ఈ సంద‌ర్భంగా కోహ్లీ మాట్లాడుతూ.. ఒక్క టెస్టు విజయంతో సంతృప్తి చెందలేం. విజ‌యం సాధించినందుకు ఆనందంగా ఉందిగానీ ఇంకా జట్టు పటిష్ఠంగా త‌యారు కావాలి. మేం కోల్పోవ‌డానికి ఏం లేదు. నాలుగేళ్ల క్రితం ఇక్క‌డే 48 పరుగుల తేడాతో ఓడిపోయాం. ఇప్పుడు అదే మైదానంలో 31 పరుగుల తేడాతో గెలిచాం. ఆస్ట్రేలియాలో గ‌తంలో మునుపెన్న‌డూ ఆధిక్యం సాధించ‌లేదు. ఇది మా జ‌ట్టు ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతోంది. న‌లుగురు బౌలర్ల‌తో 20 వికెట్లు తీయ‌డం శుభ‌సూచకం. బంతి నుంచి ఆశించిన స్థాయిలో స‌హ‌కారం ల‌భించ‌క‌పోయిన‌ప్ప‌టికీ విదేశీ గ‌డ్డ‌పై అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌ని విరాట్ వివ‌రించాడు.

Related Stories: