యూపీలో కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు

-ఆరుగురు కార్మికుల మృతి బిజ్నూర్: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం బిజ్నూర్ జిల్లాలోని మోహిత్ పెట్రో-కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం బాయిలర్ పేలి ఆరుగురు కార్మికులు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో కార్మికుడు కనిపించకుండా పోయాడు. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు చనిపోయారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరు కార్మికులను దవాఖానకు తీసుకొచ్చారు. ఒకరి ఆచూకీ ఇప్పటికీ తెలియ డం లేదు అని ఎస్పీ ఉమేశ్‌కుమార్ తెలిపారు. కొన్నిరోజులుగా పని చేయని బాయిలర్‌కు రిపేర్ చేస్తుండగా పేలుడు సంభవించిందని ఎస్పీ పేర్కొన్నారు.