రాజశేఖర్ సినిమా సెట్ కోసం భారీ ఖర్చు..?

గరుడ వేగ తర్వాత టాలీవుడ్ యాక్టర్ రాజశేఖర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘కల్కి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న తాజా సినిమా కోసం భారీ సెట్ ను వేస్తుందట చిత్రయూనిట్. సుమారు 2 కోట్ల రూపాయలు ఈ సెట్ కోసం ఖర్చు చేస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. సీ కల్యాణ్, రాజశేఖర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రశాంత వర్మ దర్శకత్వంలో వచ్చిన అ చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి టాక్ ను తెచ్చుకుంది.

× RELATED ఆ ముగ్గురు హీరోలు ఒకే ఫ్రేములో..