చెరుకు పండించకండి.. షుగర్ వ్యాధి వస్తుంది!

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ రాష్ట్ర రైతులకు ఓ వింత సలహా ఇచ్చారు. పశ్చిమ యూపీలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. రైతులు చెరుకు పంట ఎక్కువగా పండించకూడదని, దీనివల్ల షుగర్ వ్యాధి వస్తుందని అనడం విశేషం. మీరు చెరుకు కాకుండా ఇతర పంటలను కూడా పండించడం మొదలుపెట్టండి.. చెరుకు ఎక్కువగా పండించడం వల్ల ఎక్కువగా తింటారు.. దీనివల్ల షుగర్ వస్తుంది అని యోగి అన్నారు. ఢిల్లీలో కూరగాయలకు మంచి డిమాండ్ ఉన్నదని, అందుకే ఆ పంటలను ఎక్కువగా వేయాలని రైతులకు సూచించారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది మేలో చెరుకు రైతుల బకాయిలు రూ.21 వేల కోట్లకు చేరాయి. ఇందులో యూపీకి చెందిన రైతులవే రూ.12 వేల కోట్లు ఉండటం విశేషం. అయితే ఈ మధ్యే చెరుకుకు మద్దతుధరను కేంద్రం భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్న సమయంలో యోగి ఈ సూచన చేయడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. 2018-19 సీజన్‌కుగాను క్వింటాల్ ధరను రూ.275గా నిర్ణయించారు. ఇది ఉత్పత్తి ధర కంటే 77.42 శాతం ఎక్కువ. దీనివల్ల చెరుకు రైతులకు పెట్టుబడిపై కనీసం 50 శాతం ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది.

Related Stories: