అతి త‌క్కువ మ‌రుగుదొడ్లు ఉన్న దేశం ఎంటో తెలుసా?

వాషింగ్ట‌న్: అతి త‌క్కువ సంఖ్య‌లో శౌచాల‌యాలు ఉన్న దేశం ఏంటో తెలుసా. ఇండియా కాదు సుమా. అది ఇథియోపియా. ఈ దేశంలో శుభ్ర‌మైన టాయిలెట్లు త‌క్కువ‌గా ఉన్న‌ట్లు తాజాగా ఓ స‌ర్వే వెల్ల‌డించింది. వ‌ర‌ల్డ్ టాయిలెట్ డే నేప‌థ్యంలో ఈ నివేదిక‌ను రిలీజ్ చేశారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారు 230 కోట్ల మందికి స‌రైన మ‌రుగుదొడ్ల సౌక‌ర్యం లేదు. అయితే ఆఫ్రికా దేశ‌మైన ఇథియోపియాలో శౌచాల‌యాల కొర‌త 93 శాతం ఉంద‌ని యూఎన్ టీమ్ కనుగొన్న‌ది. ప‌రిశుభ్ర‌మైన మ‌రుగుదొడ్లు లేని కార‌ణంగా.. ఆ దేశంలో జ‌నం బ‌హిర్బూమికి వెళ్తున్నారు. దీని వ‌ల్ల డ‌యేరియా వ్యాపిస్తున్న‌ట్లు అంచ‌నా వేశారు. ఆఫ్రికాలో అత్య‌ధిక జ‌న‌భా క‌లిగిన రెండ‌వ దేశంగా ఇథియోపియాకు గుర్తింపు ఉన్న‌ది. ఆ దేశం శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న‌ది, అయినా కానీ అక్క‌డ స‌రైన టాయిలెట్లు లేవు.

Related Stories: