సిరిసిల్ల సిరుల ఖిల్లా కావాలన్నదే కేటీఆర్ తపన..

రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల సిరుల ఖిల్లా కావాలన్నదే కేటీఆర్ తపన అని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ముస్తాబాద్‌లో టీఆర్‌ఎస్ బహిరంగసభకు మంత్రి ఈటల రాజేందర్, కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ..దేశంలోనే ఆత్మహత్యలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. సమైక్య పాలనలో రెండు గంటల కరెంట్ కోసం అడుక్కునే పరిస్థితి ఉండేదన్నారు. దేశంలోనే రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఈటల తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ తోడు దొంగలై మళ్లీ కుట్రలకు తెగబడుతున్నారు. చంద్రబాబు డ్రామాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఈటల అన్నారు. ప్రజలే కథానాయకులై గులాబీజెండాను రెపరెపలాడిస్తరు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ ఖాయమని ఈటల పునరుద్ఘాటించారు.

Related Stories: