ఇసో అల్బెన్ డబుల్ ధమాకా

Cycling
-ప్రపంచ జూనియర్ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్
న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశారు. ఇసో అల్బెన్ డబుల్ ధమాకా కొట్టడంతో ఈ టోర్నీలో భారత్ మొత్తం మూడు పతకాలు ఖాతాలో వేసుకుంది. ఇసో అల్బెన్, రొనాల్డో సింగ్, రోజిత్ సింగ్‌తో కూడిన భారత బృందం పురుషుల టీమ్ స్ప్రింట్ ఈవెంట్‌లో ఇప్పటికే స్వర్ణం సాధించగా.. తాజాగా అల్బెన్ మరో రజతం, కాంస్యం చేజిక్కించుకున్నాడు. పోటీల చివరి రోజు సోమవారం వ్యక్తిగత స్ప్రింట్ ఈవెంట్‌లో రజతం నెగ్గిన 18 ఏండ్ల అల్బెన్.. వ్యక్తిగత కైరిన్ ఈవెంట్‌లో కాంస్య పతకం గెలుచుకున్నాడు. మొత్తం మూడు మెడల్స్‌తో భారత్ పతకాల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ సైక్లింగ్ పోటీల్లో భారత్‌కు ఇదే ఉత్తమం. జర్మనీ, న్యూజిలాండ్, గ్రీస్ వరుసగా తొలి మూడు స్థానాలు దక్కించుకున్నాయి.