ఎన్నికల నిర్వహణకు ఈఆర్‌వో నెట్ సాఫ్ట్‌వేర్

హైదరాబాద్: ఈసారి ఎన్నికల నిర్వహణకు ఈఆర్‌వో నెట్ అనే సాప్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఈ సాప్ట్‌వేర్‌తో నకిలీ ఓట్లను గుర్తించవచ్చన్నారు. ఎన్నికల ఏర్పాట్లపై రజత్‌కుమార్ స్పందిస్తూ.. ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లతో చర్చించినట్లు తెలిపారు. ఓటరు నమోదు గడువుపై కేంద్ర ఎన్నికల కమిషన్‌దే తుది నిర్ణయమన్నారు. ఇప్పటికే 70 శాతం ఈవీఎంలు, వీవీప్యాట్‌లు జిల్లాలకు చేరుకున్నాయని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల విమర్శలతో తమకు సంబంధం లేదన్నారు. ఓటింగ్ శాతం పెంచేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తమని పేర్కొన్నారు.

Related Stories: