ఇంగ్లండ్ బ్యాటింగ్.. టీమ్‌లో హనుమ విహారి

లండన్: ఇండియాతో జరుగుతున్న చివరి టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్. ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో టీమిండియా బరిలోకి దిగుతున్నది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో హనుమ విహారి టీమ్‌లోకి వచ్చాడు. విహారికి ఇదే తొలి మ్యాచ్. ఇండియా త‌ర‌ఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన 292వ ప్లేయ‌ర్ విహారి. టీమ్‌లో క‌రుణ్ నాయ‌ర్ రూపంలో మ‌రో సీనియ‌ర్ బ్యాట్స్‌మ‌న్ ఉన్నా కూడా అత‌న్ని కాద‌ని విహారిని తుది జ‌ట్టులోకి తీసుకోవ‌డం విశేషం. మరోవైపు అశ్విన్ స్థానంలో జడేజా టీమ్‌లోకి వచ్చాడు. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం సౌతాంప్టన్‌లో ఆడిన టీమ్‌తోనే బరిలోకి దిగుతున్నది. ఆ టీమ్ ఓపెనర్ అలిస్టర్ కుక్‌కు ఇదే చివరి టెస్ట్. ఈ మ్యాచ్ తర్వాత అతను ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ కానున్నాడు.
× RELATED 'రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్‌దే అధికారం'