పాపం ఆండర్సన్.. గోల్ఫ్ ఆడబోయి.. వీడియో

లండన్: అతను ప్రపంచంలోని బెస్ట్ స్వింగ్ బౌలర్లలో ఒకడు. కానీ గోల్ఫ్ స్వింగ్ మాత్రం అతన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇంగ్లండ్ పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ గోల్ఫ్ ఆడబోయి గాయపడ్డాడు. ఇండియాతో తొలి టెస్ట్ గెలిచిన తర్వాత టీమ్ మేట్ స్టువర్ట్ బ్రాడ్‌తో కలిసి సరదాగా గోల్ఫ్ ఆడాడు ఆండర్సన్. గోల్ఫ్ బాల్‌ను బలంగా కొట్టగా అది కాస్తా అక్కడున్న చెట్టుకు తగిలి తిరిగి ఆండర్సన్ మొహానికి బలంగా తాకింది. ఇది చూసి పక్కనే ఉన్న బ్రాడ్ పడీపడీ నవ్వాడు. ఈ వీడియోను కూడా అతడే ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. అయితే బాల్ బలంగా తగిలినా అతనికి పెద్దగా గాయం కాలేదని, బాగానే ఉన్నాడని బ్రాడ్ చెప్పాడు. బకింగ్‌హామ్‌షైర్‌లో 27 హోల్ స్టోక్ పార్క్ గోల్ఫ్ కోర్స్‌లో ఈ ఇద్దరూ గోల్ఫ్ ఆడినట్లు బ్రిటిష్ మీడియా వెల్లడించింది.
× RELATED నెగేటివ్ రోల్ లో వరుణ్ తేజ్..?