లార్డ్స్‌లో భారత్ బ్యాటింగ్..జట్టులో కీలక మార్పులు

లండన్: భారీ వర్షం కారణంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య గురువారం ఆరంభంకావాల్సిన రెండో టెస్టు తొలి రోజు ఆట ర‌ద్దైన విష‌యం తెలిసిందే. తాజాగా వాన తగ్గడంతో మ్యాచ్ జరిగేందుకు మైదానాన్ని సిద్ధం చేశారు. శుక్రవారం ఆరంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలి టెస్టుకు టెస్టు స్పెషలిస్ట్ పుజారాను రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేయడంపై విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దారుణ బ్యాటింగ్‌తో నిరాశపరిచిన శిఖర్ ధావన్ స్థానంలో పుజారాను ఎంపిక చేసి.. లోకేశ్ రాహుల్‌ను ఓపెనర్‌గా బరిలో దించుతున్నట్లు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు.

మరోవైపు పేసర్ ఉమేశ్ యాదవ్ స్థానంలో యువ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకున్నాడు. లార్డ్స్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందన్న నేపథ్యంలో రెండో స్పిన్నర్ వైపే భారత్ మొగ్గుచూపింది. ఇద్దరు సీనియర్ పేసర్లు, ఒక ఆల్‌రౌండర్‌తో రెడీగా ఉన్నట్లు కోహ్లీ వివరించాడు. మరోవైపు ఇంగ్లాండ్ తరఫున ఒలివర్ పోప్ అరంగేట్రం చేస్తున్నాడు.

× RELATED త‌మ్ముడు త‌ప్పి పోయాడ‌ని ఆర్ఎక్స్ 100 భామ పోస్ట్‌