భార‌త్ vs ఇంగ్లాండ్ ఐదో టెస్టు: తెలుగు కుర్రాడు అరంగేట్రం

లండన్: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 3-1తో వెనకబడ్డ టీమ్‌ఇండియా.. శుక్రవారం ఆఖరిదైన ఐదో టెస్టు మ్యాచ్‌కు సిద్ధమైంది. ఓవల్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ సారధి జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు కూర్పులో కొన్ని మార్పులు చేశారు. కొద్దిరోజులుగా అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకొని టీమ్‌లో చోటు దక్కించుకున్న తెలుగు కుర్రాడు హనుమ విహారికి తుది జట్టులో ఛాన్స్ దొరికింది. భారత్ తరఫున టెస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 292వ ప్లేయర్ విహారి కావడం విశేషం. అతనికి భారత సారథి విరాట్ కోహ్లీ టీమ్‌ఇండియా క్యాప్‌ను అందించి అభినందనలు తెలిపాడు. మరోవైపు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజాకు అవకాశం ఇచ్చారు. గత టెస్టుల్లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన హార్దిక్ పాండ్యకు విశ్రాంతినిచ్చారు. ఇంగ్లాండ్ సీనియర్ ప్లేయర్ అలిస్టర్ కుక్ కెరీర్‌లో ఇదే చివరి మ్యాచ్ కావడం విశేషం.
× RELATED సీఎం సభాస్థలిని పరిశీలించిన జీవన్‌రెడ్డి, కేఆర్ సురేశ్‌రెడ్డి