మోర్గాన్‌కు గాయం

Eoin-Morgan లండన్: సొంతగడ్డపై తమ కలల కప్‌ను సొంతం చేసుకుందామనుకుంటున్న ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో వామప్ మ్యాచ్ కోసం సౌతాంప్టన్‌లో సహచర క్రికెటర్లతో కలిసి ప్రాక్టీస్ చేస్తుండగా ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ గాయపడ్డాడు. క్యాచ్‌లు ప్రాక్టీస్ చేస్తుండగా మెర్గాన్ ఎడమచేతి చూపుడు వేలుకు గాయమైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‌మెంట్..మెర్గాన్‌కు ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించింది. అయితే గాయం అంత తీవ్రంగా ఏం లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఒక ప్రకటనలో పేర్కొంది. శనివారం ఆస్ట్రేలియాతో జరిగే వామప్ మ్యాచ్‌కు మోర్గాన్ అందుబాటులో ఉండటం లేదు. ఈనెల 30న దక్షిణాఫ్రికాతో జరిగే ప్రపంచకప్ తొలి మ్యాచ్ నాటికి గాయం నుంచి తేరుకుని మోర్గాన్ జట్టులో చేరుతాడు అని ఈసీబీ తెలిపింది. ప్రాక్టీస్ సెషన్‌లో మొత్తం 14 మంది ఆటగాళ్లు పాల్గొనగా, జోరూట్ వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉన్నాడు.