విజయ్ మాల్యా ఎఫ్‌ఐఆర్ ఇవ్వాలని సీబీఐకి ఈడీ వినతి

న్యూఢిల్లీ: కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాపై నమోదైన మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీబీఐని కోరింది. మాల్యా వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల ఎగవేతపై తదుపరి చర్యలు తీసుకునేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. కాగా, విజయ్ మాల్యా దేశంలోని పలు బ్యాంకుల నుంచి రూ.9వేల కోట్లు రుణాలు తీసుకుని ఎగవేశాడని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఆయన బ్రిటన్‌లో తలదాచుకుంటున్నాడు.

Related Stories: